మూసీ నిర్వాసితులకు నిధులు విడుదల.. ఎంతంటే

మూసీ నిర్వాసితులకు నిధులు విడుదల.. ఎంతంటే

మూసీ నిర్వాసితులకు ఆర్థిక సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 37 కోట్ల 50 లక్షల రూపాయలు విడుదల చేసింది. ఇందుకోసం, కుటుంబానికి రూ. 25 వేలు చొప్పున నగదు అందించనున్నట్లు మున్సిప‌ల్ శాఖ ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం, మూసీ నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఇండ్లు ఖాళీ చేసేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఇళ్లు వదిలి వెళ్ళిపోయే ప్రతి కుటుంబానికి 25 వేల రూపాయల ఖర్చుల సహాయంతో పునరావాసం కల్పించే ప్రక్రియ ప్రారంభమైంది.

ఇక, గ‌త జీవో ప్రకారం 16,000 ఇళ్లను మూసీ నిర్వాసితులకు కేటాయించనున్నారు. అర్హులైన బాధితులకు ఇళ్ల కేటాయింపుతో పాటు నష్టపరిహారం కూడా ఇవ్వబడనుంది. ప్రభుత్వం మూసీ నది అభివృద్ధి కోసం భూసేకరణకు అవసరమైన చర్యలను తీసుకుంటోంది. 3 జిల్లాలలో 10,200 నిర్మాణాలను గుర్తించి, వాటి పునరావాసం నిర్వహించడం కోసం అధికారిక సర్వేలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment