క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక.. అప్డేట్ చేసుకోండి

క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక.. అప్డేట్ చేసుకోండి

నెటిజ‌న్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఓ కీల‌క సూచ‌న‌ను జారీ చేసింది. కంప్యూట‌ర్‌, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్ల‌లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను వాడుతున్న వారంతా తక్షణమే అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అత్యవసర సూచనలు చేసింది. CERT-In (Indian Computer Emergency Response Team) తాజాగా రెండు ప్రధాన భద్రతా లోపాలను గుర్తించినట్టు వెల్లడించింది.

ప్రస్తుత వెర్షన్‌ను అప్‌డేట్ చేయకుండా వదిలేస్తే, రిమోట్ హ్యాకర్లు సైబర్ దాడులు జరిపే అవకాశం ఉందని హెచ్చరించింది. హ్యాకర్లు ఆర్బిట్రరీ కోడ్‌ను పంపించి, యూజర్ల వ్యక్తిగత సమాచారం దొంగిలించగలరు. అందువల్ల, సురక్షితంగా ఉండాలంటే వెంటనే క్రోమ్ లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment