బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి, కానీ గత మూడు రోజులుగా ఈ ధరలు ఒక్కసారిగా పెరిగి షాక్ కొడుతున్నాయి. వినియోగదారులు ఆశ్చర్యపోతున్నా, ఈ పెరుగుదల మరింత భిన్నంగా మారింది. శనివారం నమోదైన బంగారం ధరలను ఒకసారి పరిశీలిద్దాం..
గత రెండు రోజులుగా బంగారం ధరలు పెరిగాయి. శుక్రవారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 71,260 ఉండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 77,740గా ఉన్నాయి. అయితే, శనివారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,510కు చేరుకోవడంతో, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 78,010గా నమోదైంది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 71,510 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 78,010గా ఉంది.
వెండి ధరలు కూడా..
వెండి ధరలు కూడా అదే రీతిలో పెరిగాయి. శుక్రవారం కిలో వెండి ధర రూ. 91,700గా ఉండగా, ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో కిలో వెండి ధర రూ. 99,900గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరులో కేజీ వెండి ధర రూ. 92,400గా నమోదైంది.








