హైదరాబాద్ పాతబస్తీలో కోటి రూపాయ‌ల‌ బంగారు గాలిపటం

హైదరాబాద్ పాతబస్తీలో కోటి రూపాయ‌ల‌ బంగారు గాలిపటం

హైదరాబాద్ పాతబస్తీలో ఓ ప్రత్యేక గాలిపటం కథ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. రూ. కోటి విలువైన బంగారు గాలిపటం అంటూ ఓ వ్యక్తి గోల్డ్ కైట్ ఛాలెంజ్ ప్రకటించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అద్భుతమైన గాలిపటాన్ని చూసేందుకు, పట్టుకునేందుకు పాతబస్తీ యువకులు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు.

పోలీసుల అప్రమత్తత
ఈ గోల్డ్ కైట్ ప్రచారం పాతబస్తీలో యువతలో ఉత్సాహం పెంచినప్పటికీ, అదే సమయంలో గొడవలు, అవాంఛనీయ సంఘటనలకు దారి తీసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో అక్కడ ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టారు. ఈ బంగారు గాలిపటం నిజంగా ఉందా, లేక ఇది కేవలం ప్రచార పన్నాగమా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయినప్పటికీ, ఈ గోల్డ్ కైట్ కథ సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment