ప‌రుగులు పెడుతున్న ప‌సిడి ధ‌ర‌లు

ప‌రుగులు పెడుతున్న ప‌సిడి ధ‌ర‌లు

పసిడి పరుగులు పెడుతున్నాయి. సంక్రాంతి పండుగ కూడా వచ్చేసిన స‌రే బంగారం స‌సేమిరా త‌గ్గ‌నంటోంది. ప్ర‌స్తుతం దేశంలో బంగారం ధర రూ.80 వేలకు చేరుకుంటోంది. దేశవ్యాప్తంగా అనేక నగరాలు, పట్టణాల్లో ముఖ్యంగా ఆభరణాల తయారీకి ఉప‌యోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,000 పైన ఉంది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం ధ‌ర 10 గ్రాములు రూ.80 వేల చేరువ‌లో ఉంది.

ఆభరణాల త‌యారీకి 22 క్యారెట్ల గోల్డెన్‌ ఉపయోగిస్తారు. ఆభ‌ర‌ణాల కొనుగోలుదారులకు 22 క్యారెట్ల బంగారం ధర అతి ముఖ్యమైనది. ఈ ధరకు బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలనే నిర్ణయం సరైనదేనా లేదా కొనుగోలుదారులు ధర తగ్గే వరకు వేచి ఉండాలా..? అనే డైల‌మాలో ఉన్నారు.

ప్రధాన పట్టణాలు నగరాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాల్లోకి వెళితే.. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,640 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,640 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,800 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,640 ఉంది.విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,640 ఉంది. ఇక వెండి కూడా స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ.1,01,000 వద్ద కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment