GHMC పరిధి విస్తరణ.. డీలిమిటేషన్ ప్రక్రియ డిసెంబర్ వరకు పూర్తి

GHMC పరిధి విస్తరణ.. డీలిమిటేషన్ ప్రక్రియ డిసెంబర్ వరకు పూర్తి

జీహెచ్ఎంసీ (GHMC) వార్డుల డీలిమిటేషన్ (Delimitation) ప్రక్రియపై కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ (Commissioner R.V. Karnan) వివరించారు. గతంలో 650 చదరపు కిలోమీటర్లుగా ఉన్న జీహెచ్ఎంసీ పరిధి ఇప్పుడు 2060 చదరపు కిలోమీటర్లకు విస్తరించి, దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన మున్సిపల్ కార్పొరేషన్‌గా మారిందని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేసి, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (Centre for Good Governance) సహకారంతో వార్డుల విభజన చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు.

20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేసిన అనంతరం, డీలిమిటేషన్ ప్రక్రియ డిసెంబర్ చివరికి పూర్తి చేస్తే రాబోయే జనగణనకు ఉపయోగపడుతుందని కేంద్రం సూచించింది. ప్రతి అభ్యంతరాన్ని పరిశీలించి, నాచురల్ బౌండరీలు, ప్రధాన రహదారులు, రైల్వే లైన్‌లను ప్రతిపాదికగా తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ చెప్పారు.

భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని వార్డుల సంఖ్యను పెంచామని, కొన్ని ప్రాంతాల్లో పేర్ల, బౌండరీలపై అభ్యంతరాలు వచ్చాయని ఆయన తెలిపారు. తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో జనాభా తక్కువగా ఉన్నప్పటికీ, రాబోయే ఐదేళ్లలో పెరుగుదల దృష్ట్యా వార్డులు పెంచామని వివరించారు. ఈసారి జరగనున్న కౌన్సిల్ సమావేశానికి సంబంధిత ఎమ్మెల్యేల సూచనలను కూడా పరిగణలోకి తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment