ఆసియా కప్ (Asia Cup) 2025లో భారత జట్టు(India Team) విజయాలతో దూసుకుపోతోంది. లీగ్ దశలో యూఏఈ(UAE), పాకిస్తాన్(Pakistan), ఒమన్లను ఓడించి, సూపర్-4లో పాకిస్తాన్‌పై కూడా విజయం సాధించింది. ఇప్పుడు సెప్టెంబర్ 24న బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ కీలక మ్యాచ్ కోసం టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒక మార్పు చేసే అవకాశం ఉంది.
జస్ప్రీత్ బుమ్రా స్థానంలో అర్షదీప్ సింగ్
పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తన నాలుగు ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో 11 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 3 వికెట్లు మాత్రమే తీశాడు. ఈ నేపథ్యంలో, బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో బుమ్రా స్థానంలో టీ20 స్పెషలిస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్‌కు అవకాశం లభించవచ్చని భావిస్తున్నారు. ఈ ఒక్క మార్పు మినహా పాకిస్తాన్‌పై ఆడిన జట్టు యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ తిరిగి ఫామ్‌లోకి రావడంతో టీమిండియా పటిష్టంగా ఉంది.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్ కోసం భారత్ తుది జట్టు (అంచనా):
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్.








