ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఘోరంగా ఓడిపోవడంతో, జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై మాజీ క్రికెటర్లు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంభీర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలే ఈ పరాజయానికి కారణమని వారు ఆరోపిస్తున్నారు.
ముఖ్యంగా, తుది జట్టులో కీలకమైన బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకోకపోవడం, అలాగే బ్యాటింగ్ ఆర్డర్లో చేసిన మార్పుల వల్లే జట్టు ఓడిపోయిందని సీనియర్ క్రికెటర్లు మండిపడుతున్నారు. టీ20 ఫార్మాట్లో అర్ష్‌దీప్ సింగ్ కచ్చితంగా ఉండాల్సిందేనని మాజీ క్రికెటర్లు రవిచంద్రన్ అశ్విన్ మరియు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ బలంగా అభిప్రాయపడ్డారు.
అదనపు బ్యాటర్లతో ప్రయోగాలు చేయడం వలన మ్యాచులు గెలవడం కష్టమని, వరల్డ్ కప్ కోసం సన్నాహాలు చేస్తున్నప్పటికీ, బౌలింగ్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని వారు సూచించారు. సరైన జట్టు కూర్పుతో బరిలోకి దిగితేనే మెగా టోర్నమెంట్లో విజయం సాధ్యమని పేర్కొన్నారు. అయితే, రెండో టీ20లో బౌలర్లు తేలిపోవడానికి స్కోరు బోర్డుపై తగినన్ని రన్స్ లేకపోవడం కూడా ఒక కారణమని వారు అంగీకరించారు.








