---Advertisement---

కారులో 30 కేజీల గంజాయి.. ఐదుగురి అరెస్టు

కారులో 30 కేజీల గంజాయి.. ఐదుగురి అరెస్టు
---Advertisement---

హైదరాబాద్‌ నగరం గడ్డి అన్నారం చౌరస్తా వద్ద మలక్‌పేట్‌ పోలీస్ స్టేష‌న్‌ పరిధిలో చోటుచేసుకున్న గంజాయి అక్రమ రవాణా ఘటన కలకలం రేపింది. పోలీసుల త‌నిఖీల్లో భాగంగా కారులో త‌ర‌లిస్తున్న 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఐదుగురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు.

మ‌ల‌క్‌పేట అద‌న‌పు డీసీపీ స్వామి మీడియా స‌మావేశంలో నిందితుల వివ‌రాలు వెల్ల‌డించారు. వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న‌ ఐదుగురు యువకులు ఇక్కిరి భాస్కర్ (యాదాద్రి భువనగిరి జిల్లా), వల్లందాసు వంశీ, బోయిని వంశీ, జిట్టా కిరణ్, అల భరత్ కుమార్ రెడ్డి (మహబూబ్‌నగర్‌ జిల్లా) ముఠాగా ఏర్పడి గంజాయి దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ ముఠా ఒడిశా నుంచి గంజాయి తెచ్చి హైదరాబాద్‌ ధూల్‌పేట్‌లో విక్రయించేవారని పోలీసులు తెలిపారు.

మలక్‌పేట్‌ పోలీసుల సారథ్యంలో టాస్క్‌ఫోర్స్‌ టీం, ఎస్ఐ నవీన్‌ వాహనాలు తనిఖీ చేస్తుండగా బాలెనో కారులో గంజాయి రవాణా అవుతుండటం గుర్తించారు. వెంట‌నే కారులోని గంజాయిని స్వాధీనం చేసుకొని ఐదుగురు నిందితుల‌ను అదుపులోకి తీసుకొని కేసు న‌మోదు చేశారు. వీరి నుంచి ఒక కారు, బైక్‌, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment