గండికోట ఇంటర్ విద్యార్థి హ‌త్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌

గండికోటలో ఇంటర్ విద్యార్థి హ‌త్య కేసులో ట్విస్ట్‌

వైఎస్ఆర్ జిల్లా (YSR District) జమ్మలమడుగు (Jammalamadugu) మండలం గండికోట (Gandikota)లో ఇంటర్మీడియట్ (Intermediate) రెండవ సంవత్సరం (Second year) విద్యార్థిని వైష్ణవి (Vaishnavi) (17) దారుణ హత్య (Brutal Murder) కేసు కీల‌క మ‌లుపులు తిరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఈ కేసుపై మృతురాలి త‌ల్లిదండ్రులు పోలీసుల‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తూ నిందితుడు లోకేష్‌ (Lokesh)ను ఎన్‌కౌంట‌ర్ (Encounter) చేయాల‌ని డిమాండ్ చేస్తుండ‌గా, హ‌త్య‌లో లోకేష్ ప్ర‌మేయం లేద‌ని, అస‌లు అత్యాచారమే జ‌ర‌గ‌లేద‌ని డీఐజీ (DIG) కోయ ప్ర‌వీణ్‌కుమార్ (Koya Praveen Kumar) మీడియాకు వివ‌రించారు.

ప్రొద్దుటూరు (Proddatur)లోని గౌతమి (Gouthami) జూనియర్ కళాశాలలో (Junior College) చదువుతున్న వైష్ణవి, సోమవారం కళాశాల నుంచి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం గండికోట సమీపంలోని కొండల మధ్య పొదల్లో ఆమె మృతదేహం లభ్యమైంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా లోకేష్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ కేసును విచారిస్తున్న‌ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మీడియా సమావేశంలో ప్రియుడు లోకేష్‌కు ఈ హ‌త్య‌తో ఎలాంటి సంబంధం లేద‌ని, అస‌లు బాలిక‌పై అత్యాచారం జరగలేదని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలను మృతురాలి తల్లి పసుపులేటి దస్తగిరమ్మ తీవ్రంగా ఖండించారు.

వైష్ణవి తల్లి దస్తగిరమ్మ ఆవేదనతో మాట్లాడుతూ, “నా బిడ్డను చంపి, మాపైనే పోలీసులు నిందలు వేస్తున్నారు. నా కూతురును లోకేషే చంపాడు. ఆమె ఒంటిపై గాయాలు ఎలా వచ్చాయి? అత్యాచారం జరగలేదని ఎలా చెబుతారు?” అని ప్రశ్నించారు. కొన్ని మీడియా సంస్థలు తమపై తప్పుడు వార్తలు రాస్తున్నాయని, తమ కుటుంబంపై నిందలు వేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. “సొంత చెల్లెలిని అన్న ఎందుకు చంపుతాడు? ఇంత క్రూరంగా, నగ్నంగా చంపుతాడా?” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిష్పక్షపాత దర్యాప్తు జరిపి, నిజానిజాలు వెల్లడించి, లోకేష్‌ను ఎన్‌కౌంటర్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. “నాకు జరిగిన అన్యాయం ఇంకో తల్లికి జరగకూడదు” అని ఆమె కన్నీటితో వాపోయారు.

డీఐజీ ప్రవీణ్ మాట్లాడుతూ, కేసు దర్యాప్తు కోసం జిల్లా ఎస్పీ, జమ్మలమడుగు డీఎస్పీలు రాత్రి 9 గంటల వరకు పూర్తి సమాచారం అందిస్తామని తెలిపారు. పోలీసులు ఘటనాస్థలంలో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లో లోకేష్ వైష్ణవితో బైక్‌పై కనిపించినట్లు తెలుస్తోంది. అయితే, పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో లైంగిక వేధింపుల ఆధారాలు లేవని డీఐజీ పేర్కొన్నారు. ఈ వైరుధ్యం కేసులో సందిగ్ధతను పెంచింది. కుటుంబ సభ్యులు న్యాయం కోసం గళమెత్తుతుండగా, పోలీసులు నిష్పక్ష దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment