కడప జిల్లాలోని గండికోటలో మైనర్ బాలిక హత్య కేసు మిస్టరీ వీడింది. సొంత అన్నలే ఆమెను పొట్టన పెట్టుకున్నారు . వారం రోజుల పాటు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టి కేసును కొలిక్కి తెచ్చారు. బాలిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. బాలిక సోదరులే హంతుకులని నిర్ధారించారు. ప్రేమ వ్యవహారం.. కుటుంబ పరవువుతీస్తోందనే బాలికను ఆమె అన్నలు హతమార్చినట్లు తెలిపారు. బాలిక, బాలిక లవర్ లోకేష్ వేర్వేరు కులాలు కావడం.. ఆస్థిపాస్తుల్లోనూ తమతో సరితూగరనే భావనలో బాలిక బంధువులు ఉండడం.. ఇవే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.
సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు.. ఇన్‌స్టాగ్రాం చాటింగ్ లోనూ హత్య వ్యవహారాన్ని పసిగట్టారు. మరిన్ని సాంకేతిక ఆధారాలకోసం దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
వారం రోజుల కిందట గండికోటలో మైనర్ బాలిక వైష్ణవి శవంగా కనిపించిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ముందు ప్రియుడిని అనుమానించి విచారించారు. తర్వాత ప్రియుడి పాత్ర లేదని గుర్తించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా అసలు నిందితులు దొరికిపోయారు.
ప్రముఖ పర్యాటక ప్రాంతం గండికోటలో ఇంటర్ చదువుతున్న బాలిక శవమై కనిపించింది. బాలికను బైక్‌పై గండికోట తీసుకొచ్చిన ఎర్రగుంట్లకి చెందిన లోకేష్.. గండికోటలోని ధాన్యాగారం వద్ద విడిచిపెట్టి వెళ్లాడు.
బాలిక ప్రొద్దుటూరులోని ఓ ఇంటర్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు లోకేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. బాలికది మమ్ముటికి పరువు హత్య అని పోలీసులు నిర్ధించినట్లు తెలుస్తోంది. ఆమె అన్నలు బ్రహ్మయ్య, కొండయ్య లే చెల్లిలిని చంపినట్లు సమాచారం. జులాయి గా తిరిగే లోకేష్ ను ప్రేమించవద్దని చెప్పినా .. మాట వినక పోవటంతో ఆమె అన్నలే గండికోటలో దారుణంగా చంపారు. పోలీసుల విచారణలో అన్నలు నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది.