ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోట (Gandikota)లో జరిగిన 17 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థిని (Intermediate Female Student) హత్య కేసు (Murder Case) రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మంగళవారం ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ కేసును పోలీసులు ఛేదించారు. మైనర్ బాలికపై అత్యాచారం జరిపిన తరువాత ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితుడిగా ఎర్రగుంట్లకు చెందిన లోకేష్ (Lokesh) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఘటన వివరాలు
ప్రొద్దుటూరు (Proddatur)లోని గౌతమి జూనియర్ కాలేజీ (Gowthami Junior College)లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 17 ఏళ్ల బాలికను నిందితుడు లోకేష్ బైక్‌పై గండికోటకు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. గండికోటలోని ధాన్యాగారం సమీపంలో లోకేష్ ఆమెపై అత్యాచారానికి (Rape) పాల్పడి, ఆ తర్వాత ఆమెను హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. హత్యానంతరం బాలికను వివస్త్ర స్థితిలో వదిలి లోకేష్ పరారైనట్లు సమాచారం. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు, ఎర్రగుంట్ల (Erraguntla) మండలం హనుమాన్‌గుత్తి (Hanuman Guthi) గ్రామానికి చెందిన లోకేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఎస్పీ అశోక్ కుమార్ (SP Ashok Kumar) నేతృత్వంలో పోలీసులు ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాల ఫుటేజీ, సంఘటనా స్థలంలో సేకరించిన ఆధారాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడికి కఠిన శిక్ష పడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.