కీలక ఆధారాలు లభించినా.. కొలిక్కిరాని గండికోట హత్యకేసు

కీలక ఆధారాలు లభించినా.. కొలిక్కిరాని గండికోట హత్యకేసు

గండికోట (Gandikota) లో ఇంటర్ విద్యార్థిని (Inter Female Student) వైష్ణవి (Vaishnavi) హత్య కేసు (Murder Case) సంచ‌ల‌నంగా మారుతోంది. ఈనెల 14న బాలిక హ‌త్య జ‌రిగింది. ఈ కేసులో కీల‌క ఆధారాలు ల‌భించాయ‌ని డీఐజీ (DIG) కోయ ప్రవీణ్  (Koya Praveen) బుధవారం ప్ర‌క‌టించారు. సాయంత్రంలోగా ఎస్పీ, డీఎస్పీలు ప్రెస్‌మీట్‌లో వివరాలు వెల్లడిస్తారని ప్రకటించినప్పటికీ, 12 గంటలు గడిచినా ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. ఈ జాప్యం స్థానికుల్లో, మృతురాలి తల్లిదండ్రుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. విచారణ పూర్తికాకముందే వైష్ణవి ప్రియుడు లోకేష్‌కు హత్యతో సంబంధం లేదని, అత్యాచారం జరగలేదని డీఐజీ ప్రకటించడంతో ప్రజల్లో తీవ్ర‌మైన అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

మూడు కోణాల్లో పోలీసుల దర్యాప్తు0
ఈ కేసులో హత్య, పరువు హత్య, ఇతర అనుమానితుల పాత్రపై ద‌ర్యాప్తు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ(SP)అశోక్ కుమార్  (Ashok Kumar) గత మూడు రోజులుగా జమ్మలమడుగులోనే మకాం వేసి, ఘటనాస్థలిని పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లో వైష్ణవి ఉదయం 8:30 గంటలకు లోకేష్‌తో గండికోటకు చేరినట్లు, 10:40 గంటలకు లోకేష్ ఒక్కడే వెళ్లిపోయినట్లు గుర్తించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో వైష్ణవి టూరిస్టులకు కనిపించినట్లు సమాచారం ఉంది. పోలీసులు లోకేష్‌తో పాటు, గండికోటలో గదులు అద్దెకిచ్చే యజమానులను ప్రశ్నిస్తున్నారు. సాంకేతిక బృందం సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ, సంఘటన సమయంలో అక్కడ ఉన్న వ్యక్తులను గుర్తించే ప్రయత్నంలో ఉంది.

విచారణలో ఆలస్యం..
లోకేష్‌ను నిందితుడిగా పరిగణించకపోవడంపై మృతురాలి కుటుంబం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. “లోకేష్‌కు సంబంధం లేదని ఎలా నిర్ధారించారు? నిజమైన నిందితులను ఎందుకు పట్టుకోలేకపోతున్నారు?” అని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు పరువు హత్య కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారని, కానీ ఇంకా నిర్ధారణకు చేరుకోలేదని తెలిపారు. కీలక ఆధారాలు లభించినట్లు డీఐజీ ప్రకటించినప్పటికీ, వివరాలను వెల్లడించకపోవడం ప్రజల్లో అయోమయాన్ని సృష్టిస్తోంది. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, పోలీసులపై న్యాయం చేయాలన్న ఒత్తిడి పెరుగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment