గాంధీ కూడా శ్రీ‌రాముని భ‌క్తుడే.. – మంత్రి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

గాంధీ కూడా శ్రీ‌రాముడి భ‌క్తుడే.. - మంత్రి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) పేరును మార్చడంపై ఏపీ (Andhra Pradesh) మంత్రి, బీజేపీ(BJP) నేత‌ స‌త్య‌కుమార్ (Satyakumar) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఉపాధి హామీ పథకానికి రాముడి పేరు పెట్ట‌డం వ‌ల్ల గాంధీకి అవమానం జరిగిందన్న ఆరోపణల్లో నిజం లేద‌న్నారు. గాంధీ (Gandhi) కూడా రాముడి (Rama) భక్తుడేనని, ఆయన చ‌నిపోయే స‌మ‌యంలో కూడా “హే రాం” (“Hey Ram”) అన్నారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అందువల్ల రాముడి పేరును ఉపయోగించడం వల్ల గాంధీ ఆత్మ సంతోషిస్తుందే తప్ప, ఎలాంటి అవమానం జరగదన్నారు.

పథకానికి పేరు పెట్టినంత మాత్రాన గాంధీకి గౌరవం పెరుగుతుందా? అని మీడియా ప్ర‌తినిధుల‌ను ప్ర‌శ్నించారు మంత్రి స‌త్య‌కుమార్‌. గాంధీ పేరుతో ఉన్న ప‌థ‌కానికి రాముడి పేరు మార్చ‌డం వ‌ల్ల లాభం ఏంట‌ని మీడియా ప్ర‌శ్నించ‌గా, పథకం పేరును స్థానిక భాషలో సులభంగా అర్థమయ్యేలా పెట్టడమే లక్ష్యమని సత్యకుమార్ స్పష్టం చేశారు. ఆంగ్ల భాషతో పాటు దేశంలోని వివిధ భాషల్లో ప్రజలకు సౌలభ్యం కలిగేలా మార్పులు చేయడం సహజమని చెప్పారు. ఆంగ్లభాషలో ఉన్న‌దాన్ని మనదేశ భాషలో సౌలభ్యం కోసం మన భాషలో పెట్టారని చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment