Game Changer: ఏపీలో టికెట్ రేట్ల పెంపు, ప్రత్యేక షోలకి అనుమ‌తి

Game Changer: ఏపీలో టికెట్ రేట్ల పెంపు, ప్రత్యేక షోలకి అనుమ‌తి

‘గేమ్ చేంజర్’ చిత్ర‌ యూనిట్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. భారీ బడ్జెట్ సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి టికెట్ రేట్లు పెంచుకోవడాన్ని అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఈ సినిమా నిర్మాత దిల్ రాజు ఇటీవ‌ల డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌లిశారు, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ను క‌లిసి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం స్పందించి టికెట్ రేట్లు పెంపున‌కు ఆమోదం తెలిపింది.

టికెట్ రేట్లు ఎంతంటే?
9వ తేదీ రాత్రి 1 గంటకు స్పెషల్ బెనిఫిట్ షోలు వేయడానికి అనుమతి లభించింది. ఈ షోలకు జీఎస్టీతో కలిపి టికెట్ రేటు రూ. 600గా నిర్ణయించారు. మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ రేటు జీఎస్టీతో కలిపి రూ. 175 పెంచారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీతో కలిపి రూ. 135 పెంచారు. 10వ తేదీ ఉదయం 4 గంటల నుండి రోజుకు 6 షోలకు పర్మిషన్ ఇచ్చారు. 11వ తేదీ నుండి 23వ తేదీ వరకు రోజుకు 5 షోలు వేయడానికి ఏపీ ప్ర‌భుత్వం నుంచి అనుమతి లభించింది. అంతేకాక, టికెట్ రేట్లు మొదటి రోజు రేట్లనే కొనసాగించేందుకు కూడా అనుమతి ఇచ్చారు.

తెలంగాణలో ఇంకా క్లారిటీ లేదు
తెలంగాణలో టికెట్ రేట్లు పెంపు మరియు బెనిఫిట్ షోల అనుమతిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలో సీఎం బెనిఫిట్ షోలపై ప్రతికూలంగా స్పందించిన నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేచిచూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment