రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ నిన్ననే థియేటర్లలో విడుదలైంది. పాజిటివ్ టాక్‌తో నడుస్తున్న ఈ సినిమా అనూహ్యంగా లీక్ సమస్యను ఎదుర్కొంది. సినిమా రిలీజైన రోజునే ఫుల్ హెచ్‌డీ క్లారిటీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఈ ఘటనపై ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాకపోవడంతో అభిమానుల్లో ఆశ్చర్యం నెలకొంది. ప్రేక్షకులు థియేటర్లలోనే సినిమాను వీక్షించాలని, పైరసీని ప్రోత్సహించకూడదని సినీ వర్గాలు కోరుతున్నప్పటికీ ఇలా రిలీజ్ రోజే గేమ్ ఛేంజర్ నెట్‌లో లీక్ అవ్వడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.
Global Star condition 🥲pic.twitter.com/1AVPsRdeJi
— Kolly Censor (@KollyCensor) January 10, 2025
సినిమాపై ట్రోల్స్..
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమాపై విపరీతమైన ట్రోల్స్ మొదలయ్యాయి. సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుందని.. రీల్స్, మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ చెర్రీ సినిమాను ఆడుకుంటున్నారు. థియేటర్‌లో రామ్‌చరణ్ ఒక్కరే కూర్చున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుందని హాల్‌లోనే పలువురు రీల్స్ చేస్తున్నారు.