జనవరి 1 నుంచి జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

జనవరి 1 నుంచి జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జనవరి 1 నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజన ప‌థ‌కం అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో మాత్ర‌మే మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం అమ‌లవుతోంది.

ఈ పథకం ద్వారా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీల్లో చ‌దువుకునే 1.20 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. రేపు జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతోంది. ఇప్పుడు ఇది జూనియర్ కాలేజీలకు విస్తరించనుంది.

ఈ పథకం విద్యార్థులకు ఆహార భద్రతను కల్పించడంతో పాటు వారి విద్యపై మరింత దృష్టి పెట్టేలా చేయనుంది. ప్రభుత్వ ఈ నిర్ణయం విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి మెరుగైన స్పందన పొందే అవకాశముంది.

Join WhatsApp

Join Now

Leave a Comment