పొలం పనులకు వెళ్లిన బాలిక (Girl)ను కిడ్నీప్ (Kidnap) చేసి నలుగురు యువకులు అత్యాచారానికి (Rape) పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో సంచలనంగా మారింది. యూపీ (UP)లోని కాన్పూర్ (Kanpur) జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. 14 ఏళ్ల మైనర్ బాలికపై నలుగురు యువకులు (Four Youths క్రూరంగా అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పొలంలో పనికోసం వెళ్లిన బాలికను దారుణంగా కిడ్నాప్ చేసి, అడవుల్లోకి తీసుకెళ్లి ఈ నేరానికి పాల్పడినట్లు సమాచారం.
నిందితులు ఎవరు?
బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి దీపు యాదవ్, రవీంద్ర యాదవ్, భోలా యాదవ్, ఇక్కు యాదవ్‌లు ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరంతా హిరావాడ గ్రామానికి చెందిన వారని, నేరం అనంతరం పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
ప్రస్తుతం పరిస్థితి
బాలికను నోట్లో గుడ్డలు కుక్కి క్రూరంగా అత్యాచారానికి ఒడిగట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.







