అమెరికా మాజీ అధ్యక్షుడు కన్నుమూత

అమెరికా మాజీ అధ్యక్షుడు కన్నుమూత

అమెరికాకు 39వ అధ్యక్షుడిగా సేవలందించిన జిమ్మీ కార్టర్ (100) నిన్న రాత్రి త‌న నివాసంలో కన్నుమూశారు. కార్టర్ కుటుంబం తెలిపిన వివ‌రాల ప్రకారం.. జార్జియాలోని తన స్వగృహంలో అనారోగ్య సమస్యల కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. 1977 నుంచి 1981 వరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన కార్టర్, అధ్యక్షుడి పదవి నుంచి తప్పుకున్న తర్వాత కూడా శాంతి, మానవహక్కుల కోసం కృషి చేశారు.

జిమ్మీ కార్టర్ అమెరికా అధ్యక్షుల్లో అత్యంత సుదీర్ఘకాలం జీవించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2002లో శాంతి, మానవహక్కుల కోసం చేసిన కృషికి గానూ నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. అధ్యక్ష పదవీకాలంలోనే కాకుండా, తర్వాతి జీవితంలో కూడా ప్రపంచానికి అమూల్య సేవలు అందించారు. జిమ్మీ కార్టర్ మృతితో ప్రపంచం గొప్ప నాయకుడిని కోల్పోయింది. ఆయన త్యాగాలు, సేవలు ప్రతీ తరం గుర్తుంచుకోవలసినవి అని ప‌లువురు యూఎస్ సిటీజ‌న్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment