తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam – TTD) లో గోవుల మరణంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి (Bhuma Karunakar Reddy) సంచలన ఫొటోలు (Photos) విడుదల చేశారు. హృదయవిదారకమైన ఫొటోలపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోవును తాకడం, గో ప్రదక్షిణ చేయడం వల్ల సకల దేవతల దర్శన భాగ్యం అయినట్లేనని భావించే భారతదేశంలో, అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన వెంకటేశ్వరస్వామి ఆలయ పరిరక్షణలో ఉండే గోశాల (Gosala) లో ఆవులు (Cows) మృతిచెందడం (Deaths) ఆందోళనకరంగా మారింది. మూడు నెలల్లోనే 100కు పైగా గోవులు మృతిచెందడంపై భక్తులు మండిపడుతున్నారు. హైందవ ధర్మ పరిరక్షకులు గోమాతను సకల దేవతల స్వరూపిణిగా కొలుస్తారు. అలాంటి గోమాత (Gomatha) కు టీటీడీ గోశాలల్లో దారుణమైన పరిస్థితులు ఎదురవ్వడంపై బీజేపీ నేతలు, సనాతన వాదులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
నోట్: ఈ ఫొటోలు చూసేందుకు భయంకరంగా ఉన్న నేపథ్యంలో చిన్నారులకు చూపించొద్దని మనవి.




















