MP చిన్నీకి చుట్టుకుంటున్న‌ ‘ఉర్సా’ ఉచ్చు.. – నాని సంచ‌ల‌న‌ లేఖ‌

TDP MP చిన్నీ చుట్టూ 'ఉర్సా' ఉచ్చు.. - కేశినేని నాని సంచ‌ల‌న‌ లేఖ‌

విశాఖలో ఐటీ అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థకు విశాఖపట్నంలో భూమిని కేటాయించడం పట్ల మాజీ ఎంపీ నాని కేశినేని ప్రశంసలు కురిపించారు. ఇది నిజమైన పెట్టుబడులకు దారితీసే ప్రక్రియ అని, ఉద్యోగావకాశాలు పెరిగేలా చేసి రాష్ట్రానికి మంచి పేరును తీసుకొస్తుందని ఆయన పేర్కొన్నారు.

అయితే, ఇదే సమయంలో కొత్త‌గా స్థాపించిన ఉర్సా ప్రైవేట్ లిమిటెడ్ మరో 60 ఎకరాల భూమిని కేటాయించడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 3.5 ఎకరాలు ఐటీ పార్కులో, 56.36 ఎకరాలు ఐపీ కాపులుప్పాడ వ‌ద్ద‌ కేటాయించారు. రూ.10 ల‌క్ష‌ల మూల‌ధ‌నంతో ఏర్పాటైన ఈ సంస్థ రూ.5,728 కోట్ల పెట్టుబ‌డి పెట్ట‌నుందా..? అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్న నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు కేశినేని నాని రాసిన బ‌హిరంగ లేఖ సంచ‌ల‌నంగా మారింది.

నిజానికి ఇది కేశినేని శివనాథ్‌ బినామీ స్కాం: నాని ఆరోపణలు
భూమి కేటాయింపు జ‌రిగే కొద్ది రోజుల ముందే ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్ అయింది. సంస్థకు ఎటువంటి అనుభవం, బ్యాక్‌గ్రౌండ్ లేదు. అలాంటప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్వహించగల సామర్థ్యం ఎలా ఉంటుంది?

డైరెక్టర్లలో ఒకరు అబ్బూరి సతీష్, గుంటూరు ఎంపీ కేశినేని శివనాథ్‌కు స‌న్నిహితుడు. గతంలో వీరిద్దరూ 21 సెంచ‌రీ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ అనే కంపెనీని కలిసి నడిపారు. ఆ కంపెనీ ద్వారా కోట్లు వసూలు చేసి, ఆపై మూసివేసి చాలా మంది పెట్టుబడిదారులను మోసం చేశారు.

ఈ భూమి కేటాయింపునకు వెనుక ఉన్న అసలు వ్యక్తి కేశినేని శివనాథే అని, ఆయనే తన ప్రాబల్యాన్ని ఉపయోగించి ఉర్సా క్లస్టర్స్ పేరుతో ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

కేశినేని శివనాథ్ అనే ఎంపీకి బందరు, విజయవాడ పరిధిలో ఫ్లై యాష్, బూకియాడి, మైనింగ్, గ్యాంబ్లింగ్ మరియు రియల్ ఎస్టేట్ మాఫియాలలో తీవ్ర సంబంధాలు ఉన్నాయని ప్రజల్లో ప్రచారం అవుతోంది. ముఖ్యంగా నారా లోకేష్‌ పేరు చెప్పుతూ ప్రభుత్వపేరు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

  • చంద్రబాబు కి నాని కేశినేని విజ్ఞప్తి
  • ఉర్సా క్లస్టర్స్‌ కు కేటాయించిన భూమిని వెంటనే రద్దు చేయాలి.
  • సంస్థ యాజమాన్యం, పెట్టుబడుల మూలాలు, రాజకీయ సంబంధాలపై సమగ్ర విచారణ చేయాలి.
  • ప్రభుత్వపేరు, పార్టీపేరు దుర్వినియోగం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
  • ప్రజల స్వస్త్యమే కాదు, ప్రభుత్వ విశ్వసనీయతను కాపాడాలంటే చంద్రబాబు గారు వెంటనే చర్యలు తీసుకోవాలని నాని కోరారు. ప్రజలు ఇది అన్ని దృష్టితో గమనిస్తున్నారని, మీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చంద్ర‌బాబుకు సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment