తెలంగాణ (Telangana) మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), బీఆర్ఎస్ అధినేత (BRS Chief) కేసీఆర్(KCR) మరోసారి యశోద ఆస్పత్రి (Yashoda Hospital)కి వెళ్లారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు పూర్తిస్థాయి మెడికల్ టెస్టులు (Medical Tests) నిర్వహిస్తున్నారు. ఇటీవలే కేసీఆర్ అనారోగ్యానికి గురై రెండు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. షుగర్, సోడియం లెవల్స్‌లో తేడాలు రావడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. అప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందగా, ఆయన కోలుకుని డిశ్చార్జి కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తాజాగా, వైద్యుల సూచన మేరకే కేసీఆర్ మరోసారి యశోద ఆస్పత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో నియంత్రణలోకి వచ్చిన షుగర్, సోడియం లెవల్స్‌ను పర్యవేక్షించేందుకు, సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆయన ఆస్పత్రిలో చేరారు. కేసీఆర్ వెంట ఆయన కుమారుడు కేటీఆర్ మరియు మేనల్లుడు హరీశ్ రావు (Harish Rao) ఉన్నారు.
గతంలో ఆస్పత్రిలో ఉన్న సమయంలో కూడా కేసీఆర్ పార్టీ శ్రేణులతో భేటీ అయి స్థానిక ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించారు. అప్పట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీయడమే కాకుండా, మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.








