ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా లిసారి గేట్ ప్రాంతంలో సోహెల్ గార్డెన్‌లో నిసిస్తున్న ఓ కుటుంబం దారుణ హత్యకు గురైంది. మోయిన్, అస్మా అనే దంపతులు తమ ముగ్గురు కుమార్తెలు అఫ్సా, అజీజా, ఆదిబాతో కలిసి లిసార్ గేట్ ప్రాంతంలో నివసిస్తున్నారు. గురువారం రాత్రి ఇంట్లోని అందరూ రక్తపు మడుగులో శవాలుగా కనిపించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను చూసి షాక్‌కు గురయ్యారు.
కుటుంబం మొత్తం హత్యకు గురవ్వడంతో ఆధారాలు సేకరించేందుకు పోలీసులు ఫోరెన్సిక్ బృందాలను పిలిపించారు. సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు. ఒకేసారి ఐదుగురు కుటుంబసభ్యుల్ని చంపడం వెనుక ఉన్న మిస్టరీని చేధించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ఘటనతో స్థానిక ప్రజలు షాక్‌లోకి వెళ్లారు.
ఈ దారుణ ఘటనకు వ్యక్తిగత కక్షలే కారణమని ప్రాథమిక విచారణలో స్పష్టమవుతోందని SP విపిన్ తెలిపారు. మేస్త్రీగా పనిచేస్తున్న మోయిన్ కుటుంబాన్ని ఎవరు టార్గెట్ చేసి ఉంటారని ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యుల హత్య వెనుక ఉన్న నిజానిజాలు వెలికితీయడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను నియమించారు. ఈ సంఘటన స్థానికంగా భయాందోళనలకు దారితీసింది.