అనకాపల్లి (Anakapalli) జిల్లా రాజయ్యపేట (Rajayyapeta)లో హోం మంత్రి (Home Minister) అనిత (Anitha)కు తీవ్ర నిరసన సెగ తగిలింది. సొంత నియోజకవర్గంలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. బల్క్ డ్రగ్ పార్క్ (Bulk Drug Park) కు వ్యతిరేకంగా నక్కపల్లి మండలం రాజయ్య పేట గ్రామస్తులు చేస్తున్న ఆందోళన ఉధృతం అయింది. రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును రద్దు చేయాలని మత్స్యకారులు పెద్ద ఎత్తున గళమెత్తారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
హోంశాఖ మంత్రితో చర్చలు విఫలం అవ్వడంతో గ్రామస్తుల ఆందోళనకు దిగారు. హోంమంత్రి కాన్వాయ్ (Convoy) వెళ్లనివ్వకుండా రోడ్డుకు అడ్డంగా చెట్లు నరికి అడ్డుకున్నారు. మత్స్యకారులను సముదాయించేందుకు హోం మంత్రి అనిత కమిటీ ఏర్పాటు చేస్తామని, సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అయితే, మత్స్యకారులు కమిటీకి అంగీకరించకుండా నేరుగా డ్రగ్ పార్క్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
హోం మంత్రి కాన్వాయ్ ముందే బైఠాయించి తమ నిరసన కొనసాగించారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినా, మత్స్యకారులు వెనక్కి తగ్గకపోవడంతో బల్క్ డ్రగ్ పార్క్ పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేసింది. దీంతో మత్స్యకారులు ఆందోళన విరమించారు. బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా గత నెల రోజులుగా మత్స్యకారులు ఆందోళన చేపడుతున్నారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ వారు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోనుందో వేచిచూడాలి.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Feed (@Telugufeedsite) September 29, 2025
హోం మంత్రి అనితకు చేదు అనుభవం
పాయకరావుపేట రాజయ్య పేటలో ఉద్రిక్తత.. హోం మంత్రిని అడ్డుకున్న మత్స్యకారులు
బల్క్ డ్రగ్ పార్క్ ను రద్దు చేయాలని మత్స్యకారులు డిమాండ్
హోం మంత్రి కాన్వాయ్ అడ్డగింత.. కాన్వాయ్ ముందు బైఠాయింపు
బల్క్ డ్రగ్ పార్క్ సమస్యపై కమిటీ… pic.twitter.com/34FCN07iPp







