నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘డాకు మహారాజ్’ సినిమా నుంచి మ్యూజికల్ అప్డేట్ అందింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా, తొలి సింగిల్ ‘ది రేజ్ ఆఫ్ డాకు’ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సాంగ్ సంగీత ప్రియులను ఆకట్టుకునేలా అద్బుతమైన ఎనర్జీతో రూపొందించబడింది.
సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి
సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 12న థియేటర్లలో ‘డాకు మహారాజ్’ సందడి చేయనుంది. అభిమానుల అంచనాలకు తగిన విధంగా ఈ సినిమా భారీ విజయాన్ని సాధించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.