నేచురల్ స్టార్ నాని(Nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) కాంబినేషన్ మరోసారి సినీ ప్రియుల్లో ఆసక్తి పెంచింది. ‘దసరా’ సినిమా(Paradise Movie)తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన ఈ క్రేజీ కాంబో, ఇప్పుడు ‘ది ప్యారడైజ్’తో మరోసారి భారీ హిట్ కోసం సిద్ధమవుతోంది. 2026 మార్చి 26వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్(Glimpse Release)ను మూవీ టీమ్ విడుదల చేసింది. ఈ చిన్న వీడియోలోనే సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. విశేషంగా, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, నాని పవర్‌ఫుల్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఈ సినిమా కథ, కథనంపై ఇంకా అధికారిక సమాచారం రానప్పటికీ, విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే మరో విభిన్నమైన కథతో ప్రేక్షకులను అలరించేందుకు మూవీ టీమ్ సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. నాని నటన, శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్టోరీ టెల్లింగ్ – ఈ కాంబో ఇంకో సారి విజయం సాధిస్తుందా? చూడాలి.