సీరియ‌ల్ షూటింగ్‌లో భారీ అగ్నిప్రమాదం

సీరియ‌ల్ షూటింగ్‌లో భారీ అగ్నిప్రమాదం

డైలీ సీరియ‌ల్ షూటింగ్‌లో సంభ‌వించిన‌ భారీ అగ్నిప్ర‌మాదం న‌టీన‌టుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేసింది.
ముంబైలోని గోరేగావ్ ఫిల్మ్ సిటీలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అనుపమా సీరియల్‌కు సంబంధించిన టెంట్ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. వెంట‌నే సిబ్బంది అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు.

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అగ్నిమాపక విభాగం వెంటనే స్పందించి ఘటనా స్థలానికి నాలుగు ఫైర్‌ ఇంజిన్లు, పెద్ద నీటి ట్యాంకర్లు పంపించారు. ఉదయం 6.10 గంటల సమయంలో మంటలు మొదలయ్యాయని, ఇది దాదాసాహెబ్ ఫాల్కే చిత్రనగరిలో ఉన్న మరాఠీ బిగ్ బాస్ సెట్ వెనుక భాగంలో జరిగిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. అసిస్టెంట్ డివిజనల్ ఫైర్ ఆఫీసర్ సహా ముగ్గురు స్టేషన్ అధికారి అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment