వృద్ధాశ్రమంలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి, 9 మందికి గాయాలు

వృద్ధాశ్రమంలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి, 9 మందికి గాయాలు

ఫ్రాన్స్‌లోని వాల్-డి’ఓయిస్ ప్రావిన్స్‌లోని ఒక వృద్ధాశ్రమంలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వారి వయస్సు 68, 85, 96 సంవత్సరాలుగా గుర్తించారు. ఈ ప్రమాదం వల్ల మరో తొమ్మిది మంది గాయపడ్డారు. గాయపడిన వారింతలో 7 మంది వృద్ధులు, ఇద్ద‌రు సిబ్బంది ఉన్నారు. వారంతా పొగ పీల్చడం వల్ల మరణించారని తెలిపారు.

ప్రమాదం ఎలా జరిగింది?
మేయర్ మైఖేల్ లాకౌక్స్ BFM TVతో మాట్లాడుతూ.. ఈ సంఘటనను తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నామ‌న్నారు. లాండ్రీ గదిలో మంటలు మొదలయ్యి, తరువాత మూడవ అంతస్తులోని కొంత భాగానికి వ్యాపించాయి. అగ్నిమాపక దళాలు 140 మందితో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment