ఆర్థిక శాఖ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం.. కీల‌క ఫైల్స్‌ ద‌గ్ధం?

ఏపీ ఆర్థిక శాఖ హెడ్ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఆర్థిక శాఖ (Finance Department) ప్రధాన కార్యాలయమైన నిధి భవన్ (Nidhi Bhavan) లో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ద‌ట్ట‌మైన పొగ ఆ ప్రాంత‌మంతా వ్యాపించింది. ఉద్యోగులు తమ విధుల్లో ఉన్న సమయంలోనే భవనం రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనపై సుమారు 300 మంది ఉద్యోగులు భయంతో వెంటనే భవనం నుండి బయటకు పరుగులు తీశారు.

అగ్నిప్రమాదానికి సెంట్రల్ ఏసీ (Central AC) లో షార్ట్ సర్క్యూట్ (Short Circuit) కారణమయ్యుండొచ్చని ప్రాథ‌మిక అంచ‌నాకు వ‌చ్చారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా కార్యాలయంలోని కంప్యూటర్లు, ముఖ్యమైన దస్త్రాలు పెద్ద ఎత్తున ద‌గ్ధ‌మ‌య్యే ప్రమాదం ఉందని సమాచారం అందుతోంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల జీతాలు (Salaries), వివిధ శాఖల లావాదేవీల బిల్లులు (Bills) నిధి భవన్‌లోనే ఉండటంతో, ఈ ప్రమాదం ఎంత నష్టానికి కారణమయ్యిందో ఇంకా పూర్తి అంచనాకు రాలేదు. ఆన్‌లైన్ సిస్టమ్ (Online System) అయినా, కంప్యూటర్లు నష్టం చెందడంతో లావాదేవీల పూర్తి సమాచారం మంటల్లో కాలిపోయినట్లు ఉద్యోగులు భావిస్తున్నారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది (Fire Department) తప్ప మరెవ్వరినీ లోపలికి అనుమతించడం లేదు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment