---Advertisement---

దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు

దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు
---Advertisement---

టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు, హీరోలు వెంకటేష్, రానా, అభిరామ్‌లపై కేసు నమోదైంది. ఫిలింనగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత వివాదంలో, ఈ కుటుంబ సభ్యులపై నాంపల్లి కోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ, డెక్కన్ కిచెన్ హోటల్‌ను కూల్చివేయడంతో 448, 452, 458, 120బి సెక్షన్ల కింద ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ కేసు నడుమ దగ్గుబాటి కుటుంబంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

2022 నవంబరులో జిహెచ్‌ఎంసీ సిబ్బంది బౌన్సర్లతో కలిసి హోటల్‌ను పాక్షికంగా ధ్వంసం చేశారు. దీంతో బాధితుడు నందకుమార్ అప్పట్లో ఈ విషయంపై కోర్టుని ఆశ్రయించాడు. దీంతో విచారణ జరుగుతున్న సమయంలో హోటల్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల‌ను బేఖాత‌రు చేస్తూ దగ్గుబాటి కుటుంబ సభ్యులు 2024 జనవరిలో దక్కన్ హోటల్‌ను పూర్తిగా కూల్చారు. దీంతో నందకుమార్ నాంపల్లి కోర్టుని ఆశ్రయించాడు.

కోర్టు ఆదేశాల‌ను లెక్క‌చేయ‌కుండా హోటల్ కూల్చిన దగ్గుబాటి ఫ్యామిలీలోని సురేష్ బాబు, వెంకటేష్, అభిరామ్ తదితరులపై కేసు నమోదు చేయాల‌ని నాంప‌ల్లి కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఫిలింన‌గ‌ర్ పోలీసులు వారిపై కేసు న‌మోదు చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment