గెలుపు ఎవరిదైనా కానీ విజయం మాత్రం భారత్ దే..

గెలుపు ఎవరిదైనా కానీ విజయం మాత్రం భారత్ దే..

చెస్‌ చరిత్ర (Chess History)లో భారత అభిమానులకు (India’s Fans) ఇది ఓ మరిచిపోలేని టోర్నీ. ఫిడే (FIDE) మహిళల ప్రపంచకప్‌ (Women’s World Cup)లో ఇద్దరు భారత అమ్మాయిలే టైటిల్ కోసం తలపడటం ఇదే మొదటిసారి. నేటి నుంచి ప్రారంభమయ్యే ఫైనల్లో, చెస్ దిగ్గజం కోనేరు హంపి (Koneru Humpy) యువ సంచలనం దివ్య దేశ్‌ముఖ్‌ (Divya Deshmukh)తో పోటీ పడనుంది. రెండు దశాబ్దాలుగా భారత చెస్‌లో ఓ వెలుగు వెలుగుతున్న తార హంపి అయితే, దివ్య ఉవ్వెత్తున ఎగసిన జ్వాల. అనుభవానికీ, యువతకూ మధ్య జరిగే ఈ పోరులో ఎవరు పైచేయి సాధించినా చరిత్రే, కప్ మాత్రం భారత్‌ (Indiaకే దక్కనుంది.

విజయం ఎవరిని వరిస్తుంది?
ఇది భిన్న తరాల మధ్య జరిగే పోరాటం. అనుభవంతో పాటు ఒత్తిడిని తట్టుకోగల సామర్థ్యం హంపికి ఉండటం వల్ల ఫైనల్‌(Final)లో ఆమెకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. సెమీఫైనల్లో చైనా ప్లేయర్, టాప్‌సీడ్ లీ టింగ్ జి తో జరిగిన పోరులో గట్టి పోటీ ఎదురైనా ఆమె నిలబడి గెలవడమే దీనికి నిదర్శనం. అయితే, అంచనాలకు మించి రాణించి తొలిసారి ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరిన దివ్యను తక్కువ అంచనా వేయలేం. ఈ టోర్నీలో బలమైన ప్రత్యర్థులపై నెగ్గిన ఈ టీనేజర్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఒత్తిడిని తట్టుకుని నిలబడితే దివ్య చరిత్ర సృష్టించగలదు.

వెటరన్‌ స్టార్: కోనేరు హంపి
భారత చెస్‌లో 38 ఏళ్ల హంపిది ఓ ప్రత్యేక ప్రస్థానం. రెండు దశాబ్దాల కెరీర్‌లో ఈ విజయవాడ అమ్మాయి ఎన్నో ఘనతలను సొంతం చేసుకుంది. రెండుసార్లు ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌గా నిలిచింది. పెళ్లి, బిడ్డ పుట్టిన తర్వాత ఆట నుంచి కొంత విరామం తీసుకున్నప్పటికీ, పునరాగమనంలో అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఒత్తిడిలోనూ స్థిరంగా ఆడగలగడం, పటిష్టమైన డిఫెన్స్, అపారమైన అనుభవం హంపి బలాలు. తన కెరీర్‌లో ఇప్పటిదాకా దక్కని ప్రపంచకప్‌ను సాధించాలని ఆమె కృతనిశ్చయంతో ఉంది.

కొత్త కెరటం: దివ్య దేశ్‌ముఖ్
దివ్య దేశ్‌ముఖ్, హంపితో పోలిస్తే పెద్దగా అనుభవం లేని యువ క్రీడాకారిణి. నాగ్‌పూర్‌కు చెందిన 19 ఏళ్ల దివ్య, సీనియర్ విభాగంలో ఆడిన టోర్నీలు కూడా తక్కువే. ఆమె ఇంకా గ్రాండ్‌మాస్టర్ కూడా కాలేదు. 2021లో ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాను పొందిన ఆమె, 2023లో ఆసియా ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది. ఒలింపియాడ్‌లో మూడు పసిడి పతకాలు కూడా ఆమె ఖాతాలో ఉన్నాయి. గత ఏడాది తొలిసారి 2500 ఎలో రేటింగ్‌ను అందుకుంది. తన దూకుడైన ఆటతో గ్రాండ్‌మాస్టర్లను సైతం కంగుతినిపిస్తోంది. తాజాగా ప్రపంచకప్‌లో తనకన్నా మెరుగైన రేటింగ్‌ ఉన్న ద్రోణవల్లి హారిక (క్వార్టర్‌ఫైనల్), జు జినర్‌ (ప్రిక్వార్టర్స్)పై నెగ్గడమే దీనికి ఉదాహరణ. సెమీస్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్ జాగ్‌యిపై గెలవడం ఆమెను మరో మెట్టు ఎక్కించింది.

రెండు రోజుల సమరం, భారీ ప్రైజ్‌మనీ
ఫైనల్ క్లాసికల్ ఫార్మాట్‌లో రెండు రోజులు జరుగుతుంది. రెండు రోజుల్లో ఫలితం తేలకపోతే, సోమవారం ర్యాపిడ్ ఫార్మాట్‌లో టైబ్రేక్ నిర్వహిస్తారు.

ప్రపంచకప్‌ విజేతకు టైటిల్‌తో పాటు రూ.43 లక్షలు ప్రైజ్‌మనీగా దక్కనున్నాయి. రన్నరప్‌కు రూ.30 లక్షలు లభిస్తాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment