టాలీవుడ్ నిర్మాతపై కాస్టింగ్ కౌచ్ కామెంట్స్‌.. క్లారిటీ ఇచ్చిన నటి

తెలుగు నిర్మాతపై నటి ఫాతిమా కాస్టింగ్ కౌచ్ కామెంట్స్‌..

సినిమా ఇండ‌స్ట్రీ (Cinema Industry)లో గ‌త కొంత కాలంగా కాస్టింగ్ కౌచ్ (Casting Couch) వ్య‌వ‌హారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ ఏడాది ప్రారంభంలో ఫాతిమా సనా షేక్ (Fatima Sana Shaikh) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, దక్షిణ చిత్ర పరిశ్రమ (South Film Industry)లో తనకు క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది పడ్డానని చెప్పారు. హైదరాబాద్‌ (Hyderabad)కు చెందిన కొందరు ఏజెంట్లు (Agents) అవకాశాలు (Opportunities) ఇప్పిస్తానని చెప్పి, “ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారా..?” అని అడిగారని తెలిపారు. ఆ తర్వాత కొందరు టాలీవుడ్ నిర్మాతలు (Tollywood Producers) కూడా తనను పరోక్షంగా అలాంటి ప్రశ్నలే వేశారని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి.

తాజా వివరణ
తాజాగా, ఫాతిమా మరోసారి ఈ విషయంపై స్పందించారు. దక్షిణాదిలో తాను క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు గతంలో చెప్పిన మాటలు నిజమేనని ఆమె పునరుద్ఘాటించారు. అయితే, తాను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, ఒక వ్యక్తి వల్ల మాత్రమే తాను ఇబ్బంది పడ్డానని ఆమె స్పష్టం చేశారు. ఆ వ్యక్తి ఒక ఏజెంట్ లేదా చిన్న నిర్మాత కావచ్చని, కానీ దక్షిణాది చిత్ర పరిశ్రమ మొత్తాన్ని తాను తప్పుపట్టలేదని ఆమె వివరించారు. ఒకరి గురించి చెప్పిన మాటలను కొందరు అక్కడి పరిశ్రమ మొత్తానికి ఆపాదించి ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. “క్యాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి పరిశ్రమలో ఉంది. అనేక రంగాలలో కూడా ఇలాంటి వాతావరణమే ఉంది. దారి వెంట వెళ్తున్న ఒక స్త్రీని (Woman) అదేపనిగా చూస్తూ ఆమెను తప్పుగా చూసేవారు ఎందరో ఉన్నారు. వాటిని దాటుకుని నేటి మహిళ ముందుకు వెళ్తుంది” అని ఆమె అన్నారు.

గతంలో ఫాతిమా చెప్పినవి
ఆమిర్ ఖాన్ (Aamir Khan) నటించిన ‘దంగల్’ (‘Dangal’) సినిమాతో ఫాతిమాకు మంచి గుర్తింపు వచ్చింది. గీతా ఫోగట్ పాత్రలో (Geeta Phogat Role) ఆమె అద్భుతంగా నటించారు. 2015లో ఆమె తెలుగులో నటించిన ‘నువ్వు నేను ఒకటవుదాం’ (‘Nuvvu Nenu Okkatavadam’) చిత్రం విడుదలైంది. ఆ సినిమా తర్వాత మరో సినిమా చేస్తున్న క్రమంలోనే ఒక నిర్మాత నుంచి క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు గతంలో ఆమె ఇలా చెప్పారు:

“హైదరాబాద్‌లో నేను చిన్నస్థాయి నిర్మాతలను కలుసుకున్నాను. ఒక హోటల్‌లో దిగాను. ఆ నిర్మాతలు క్యాస్టింగ్ కౌచ్ గురించి నాతో మాట్లాడారు. ‘నీకు అవకాశం ఇవ్వాలంటే మేము చెప్పిందల్లా చేయాలి’ అని అన్నాడు. నేను కాదని చెప్పడంతో ఆ నిర్మాత నన్ను తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. చాలా అసభ్యకరంగా క్యాస్టింగ్ కౌచ్ గురించి పచ్చిగానే అడిగేశాడు. ఇంకొకరు అదే విషయాన్ని డైరెక్ట్‌గా చెప్పకపోయినా.. వారు చెప్పినదాని అర్థం ఏమిటో స్పష్టంగా అర్థమైంది. ఒకప్పుడు బాలీవుడ్‌లో మంచి పాత్రలు రావడానికి సౌత్ సినిమా మొదటి అడుగు అని నేను నమ్ముతాను. కానీ, నాకు ఇలా జరుగుతుందని అనుకోలేదు.”

Join WhatsApp

Join Now

Leave a Comment