విజయ్ హజారే ట్రోఫీ మొదటి రోజే పంజాబ్ ఆటగాడు అన్మోల్‌ప్రీత్ సింగ్ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచే ఘనత సాధించాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో అన్మోల్‌ప్రీత్ 35 బంతుల్లోనే శతకం బాదాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
అంతకుముందు ఈ ఘనత భారత విధ్వంసకర బ్యాటర్ యూసుఫ్ పఠాన్ పేరిట ఉండేది. అతను బరోడా తరఫున మహారాష్ట్రపై 2010లో 40 బంతుల్లో శతకం సాధించాడు. ఓవరాల్‌గా చూసుకుంటే లిస్ట్ ఏ క్రికెట్‌లో అన్మోల్‌ప్రీత్ మూడో స్థానంలో నిలిచాడు. జేక్ ఫ్రేజర్ (29 బంతుల్లో), ఏబీ డివిలియర్స్ (31 బంతుల్లో) అతని కంటే ముందున్నారు.
అన్మోల్‌ప్రీత్ సింగ్ అజేయ ఇన్నింగ్స్‌లో 45 బంతుల్లో 115 పరుగులు (12 ఫోర్లు, 9 సిక్సులు) చేశాడు. ఈ విధ్వంసకర ఆటతీరు మ్యాచ్‌లో విజయం సాధించడమే కాదు, క్రికెట్ చరిత్రలో అతనికి ప్రత్యేక స్థానాన్ని కల్పించింది.
‘ఇది సినిమా కాదు బ్రదర్’.. – పవన్‌కు కాంగ్రెస్ ఎంపీ కౌంటర్