పట్టాదారు పాసుపుస్తకం (Pattadar Passbook) కోసం తన ప్రాణాలనే ఫణంగా పెట్టి నిరసనకు దిగారో రైతు (Farmer). ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అనకాపల్లి జిల్లా (Anakapalli District) అచ్యుతాపురంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. తన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని కోరుతూ సెల్ టవర్ (Cell Tower) ఎక్కి హల్‌చల్ చేశాడు. చేతిలో పెట్రోల్ బాటిల్ (Petrol Bottle) పట్టుకొని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
అధికారుల (Officials) చుట్టూ తిరిగిన తన భూమికి పట్టాదారు పాస్ బుక్ మంజూరు చేయడం లేదని, అధికారుల తీరుతో విసుగు చెందానని ఆ రైతు చెప్పారు. తన సమస్యపై ముఖ్యమంత్రి(CM), డిప్యూటీ సీఎం (Deputy CM) వెంటనే స్పందించాలని కోరారు. అంతేకాక, పైడితల్లి మాన్యం భూముల్లో (Paiditalli Manyam Lands) జరుగుతున్న అవకతవకాలపై ప్రభుత్వ స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తత సృష్టించగా, అధికారులు స్పందించి రైతును క్షేమంగా కిందికి రప్పించేందుకు చర్చలు జరిపారు. వ్యవసాయ భూముల సమస్య మరోసారి రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.








