ఫ్యామిలీ స్టార్ విక్టరీ వెంకటేష్ ‘AK 47’ సిద్ధం!

ప్యామీలీ స్టార్ వెంకటేష్ ‘AK 47’ సిద్ధం!

వెంకటేష్ – త్రివిక్రమ్ (Venkatesh-Trivikram) కాంబినేషన్‌లో రూపొందుతున్న “ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 – AK 47” (Aadarsha Kutumbam House No: 47 – AK47)చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఈ టైటిల్‌ను విన్న క్షణం నుంచే కుటుంబ భావోద్వేగాలు, హాస్యం, అలాగే సస్పెన్స్‌కి సంబంధించిన అంశాలు ఈ చిత్రంలో ఉండబోతున్నాయన్న సూచన లభించింది. త్రివిక్రమ్ స్టైల్‌లో వచ్చే ఫ్యామిలీ డ్రామా, వెంకటేష్ నాచురల్ స్క్రీన్ ప్రెజెన్స్ కలగలిసి వినోదంతో (Entertainment) పాటు సున్నితమైన భావోద్వేగాలను కూడా అందించబోతున్నాయని సినిమా యూనిట్ చెబుతోంది.

ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తుండగా, హారిక & హాసిని క్రియేషన్స్ (Haarika Haasini Creations) నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌లో వెంకటేష్ ఫ్యామిలీ మన్ అవతారంలో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. హర్షవర్ధన్ రమేష్‌వర్ (Harshavardhan Rameshwar) సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2026 వేసవిలో విడుదల కానుంది. మరింత శ్రద్ధగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, కథనం, భావోద్వేగాలు, అలాగే వెంకటేష్ టైమ్‌లెస్ ఛార్మ్‌తో ప్రేక్షకులకు ఒక అందమైన కుటుంబ కథగా చేరువ కావడానికి సిద్ధంగా ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment