బాలీవుడ్ (Bollywood) నటుడు రోహిత్ బాస్ఫోర్ (Rohit Basfor) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందాడు (Died). అస్సాం (Assam) లోని తన మిత్రులతో కలిసి సోమవారం సాయంత్రం సమీప అడవికి వెళ్లిన రోహిత్, అక్కడ ఒక యాక్సిడెంట్ (Accident) కారణంగా మృతిచెందినట్లు అతడి మిత్రులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ మృతిపై కొన్ని అనుమానాస్పద కోణాలు ఉన్నాయని భావించిన కుటుంబ సభ్యులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ (Family Man 3) వెబ్‌సిరీస్‌లో రోహిత్, స్టార్ నటి సమంతతో కలిసి కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ వార్త బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.







