రాష్ట్రంలో దొంగ పెన్షన్లకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటపడ్డాయని, 3.20 లక్షల మంది దొంగ పింఛన్లు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం నిర్ధారించిందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. గత మూడు రోజులుగా దొంగ పెన్షన్లపై దృష్టి సారించామని, ఈ పరిశీలనలో తప్పుడు వయస్సు ధ్రువపత్రాలు సృష్టించి పెన్షన్ పొందుతున్నట్టు నిర్ధారించామన్నారు. గురువారం నాతవరం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభ సభలో మాట్లాడిన ఆయన, ఈ పెన్షన్ మోసాలపై ప్రభుత్వ తక్షణ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
తదుపరి చర్యలు
ప్రభుత్వం ఈ బోగస్ పెన్షన్లను రద్దు చేసేందుకు, పింఛన్ల ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడానికి చర్యలు చేపట్టనుందని, నకిలీ పెన్షన్ల నివారణ కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఇలాంటి మోసాలు ప్రభుత్వ ఖజానాపై భారాన్ని పెంచుతాయని, ప్రజా సంక్షేమానికి అవరోధంగా మారుతాయని ప్రభుత్వ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.