‘ఆఫ్రికా ఫార్ములాతో కల్తీ మద్యం’.. ఏపీలో సంచలనం!!

'ఆఫ్రికా ఫార్ములాతో కల్తీ మద్యం'.. ఏపీలో సంచలనం!!

క‌ల్తీ లిక్క‌ర్ (Fake Liquor) త‌యారీ మాఫియాలో బ‌య‌ట‌ప‌డుతున్న సంచ‌ల‌న విష‌యాలు ఏపీ ప్ర‌జ‌ల‌కు షాకిస్తుండ‌గా, మందుబాబుల‌ను మాత్రం బెంబేలెత్తిస్తున్నాయి. అన్న‌మ‌య్య జిల్లా (Annamayya District) తంబ‌ళ్ల‌ప‌ల్లె (Tamballapalle) మొల‌క‌ల‌చెరువు  (Molakalcheruvu)లో భారీగా న‌కిలీ మ‌ద్యం, ప్రాణాంత‌క‌ స్పిరిట్ బాటిళ్లు స్వాధీనం త‌రువాత‌, విజయవాడలోని ఇబ్రహీంపట్నం ప్రాంతంలోనూ అంత‌కు మించిన నకిలీ మద్యం తయారీ కేంద్రాలను ఎక్సైజ్ శాఖ అధికారులు ఛేదించారు. రెండు వేర్వేరు ప్రదేశాల్లో దాడులు జరిపి, పెద్దఎత్తున నకిలీ మద్యం బాటిళ్లు, స్పిరిట్ క్యాన్లు, యంత్రాలు స్వాధీనం చేసుకోవ‌డం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.

ఈ న‌కిలీ మ‌ద్యం త‌యారీ కేసు ప్రాథ‌మిక‌ విచారణలో షాకింగ్ నిజాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. “ఆఫ్రికా నకిలీ ఫార్ములా” (Africa Fake Formula)ని టీడీపీ(TDP) నాయకులు వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. కార్మెల్, రంగు నీళ్ళు కలిపి రుచి, వాసన లేకుండా మద్యం తయారు చేస్తున్నట్లు తేలింది. కర్టెన్ బాక్స్‌లలో భారీగా స్పిరిట్ క్యాన్లు, ప్రముఖ బ్రాండ్ల లేబుళ్లు, ఖాళీ బాటిళ్లు స్వాధీనం అయ్యాయి. దాడుల్లో మొత్తం 3,325 లీటర్ల స్పిరిట్, 1,272 నకిలీ బాటిళ్లు, 6,578 లేబుల్స్ లేని బాటిళ్లు, 22,000 ఖాళీ బాటిళ్లు, 6 ఖాళీ క్యాన్లు, యంత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

కేసులో టీడీపీ నేతలు కీలక పాత్ర పోషించినట్లు విచారణలో బయటపడింది. ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు (Janardhan Rao) సోదరుడు జగన్ మోహన్ రావు (Jagan Mohan Rao), సన్నిహితుడు కట్టా రాజును అదుపులోకి తీసుకుని విచారించగా, నకిలీ మద్యం తయారీ ప్రక్రియ వివరాలు వెలుగులోకి వచ్చాయి. విదేశాల్లో ఉన్న జనార్ధన్ రాగానే అరెస్ట్ చేస్తామని ఎక్సైజ్ శాఖ డీసీ శ్రీనివాస్ రావు వెల్లడించారు.

కల్తీ లిక్కర్ మాఫియా బయటపడడంతో రాష్ట్ర వ్యాప్తంగా మ‌ద్యం ప్రియుల్లో ఆందోళన నెలకొంది. న‌కిలీ బాటిల్ కూడా అచ్చం రియ‌ల్‌ను త‌ల‌ద‌న్నేలా ఉండ‌డంతో మందుబాబులకు గంద‌ర‌గోళ ప‌రిస్థితి ఏర్ప‌డింది. నిజమైనది ఏది, కల్తీది ఏది అన్న సందేహంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. డబ్బుకి ఆశపడి మందుబాబుల జీవితాలతో రాజకీయ నాయకులు చెలగాటం ఆడుతున్నారని ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. క‌ల్తీ మ‌ద్యం మాఫియా ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతుండ‌డంతో వైన్ షాపులోకి వెళ్లి ఏ బాటిల్ కొనుక్కోవాల‌న్నా.. భ‌య‌ప‌డే ప‌రిస్థితి ఏర్ప‌డింది.

Join WhatsApp

Join Now

Leave a Comment