క‌ల్తీ మద్యం కింగ్ పిన్ అరెస్ట్‌.. బ‌య‌ట‌కొస్తున్న వాస్త‌వాలు

క‌ల్తీ మద్యం కింగ్ పిన్ అరెస్ట్‌.. బ‌య‌ట‌కొస్తున్న వాస్త‌వాలు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క‌ల్తీ మద్యం (Fake Liquor) కేసులో అధికార పార్టీ (Ruling Party) నాయకుల అసలు రంగు ఒక్కొక్క‌టిగా బయటపడుతోంది. క‌ల్తీ మ‌ద్యం కేసులో ప్రధాన నిందితుడు, కీల‌క సూత్ర‌ధారి టీడీపీ (TDP) నాయకుడు జనార్ధన్ రావు (Janardhan Rao)ను ఎక్సైజ్ శాఖ అధికారులు శుక్ర‌వారం రాత్రి గన్నవరం విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని, రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు.

రహస్యంగా నకిలీ మద్యం వ్యాపారం
పోలీసుల దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. జనార్ధన్ రావు ములుకల చెరువు, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో నకిలీ మద్యం తయారీ యూనిట్లు (డెన్లు) ఏర్పాటు చేసినట్లు నిర్ధార‌ణ అయ్యింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఈ వ్యాపారానికి పునాది పడిందని విచారణలో తేలిన‌ట్లుగా స‌మాచారం. అధికార బలంతో ఈ మద్యం యూనిట్లు గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్నాయని అధికారులు గుర్తించారు.

పెద్దల వరకూ చేరిన లావాదేవీలు
జనార్ధన్ రావు నోరు విప్పితే మరికొందరు టీడీపీ పెద్దల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. నకిలీ మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బుతో భూములు, ఆస్తులు కొనుగోలు చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా, జనార్ధన్ రావు పిన్ని కుమారుడు కళ్యాణ్ ఇటీవల గొల్లపూడిలో రూ.3 కోట్ల విలువైన భూమి కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి.

తనిఖీల్లో బయటపడ్డ షాకింగ్ ఫ్యాక్ట్స్
ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam)లోని ఒక డెన్‌ (Den)లో తనిఖీల సమయంలో కళ్యాణ్ 60 కేసుల నకిలీ మద్యం బాత్‌రూంలో పారబోసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనతో మొత్తం వ్యవహారంపై పెద్ద ఎత్తున దర్యాప్తు కొనసాగుతోంది. చిత్తూరు, ఏలూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ఉన్న పలు మద్యం దుకాణాలకు నకిలీ మద్యం సరఫరా చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ప్రస్తుతం టీడీపీ నాయకుడు జయ చంద్ర రెడ్డి (Jaya Chandra Reddy)తో జనార్ధన్ రావు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించారు. రాబోయే రోజుల్లో మరికొన్ని కీలక అరెస్టులు జరగవచ్చని సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment