అధికార పార్టీ నాయకుడు రాజకీయ పలుకుబడిని అడ్డుపెట్టుకుని అక్రమ వసూళ్లకు (Illegal Collections) పాల్పడటం ఒక ఎత్తైతే, ఏకంగా ఏసీబీ (ACB) (అవినీతి నిరోధక శాఖ) అధికారిగా చెప్పుకుంటూ ప్రభుత్వ అధికారులనే బెదిరించడం మరో ఎత్తు. అనంతపురం జిల్లాలో (Anantapur District) జరిగిన ఈ వింత నేరం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
నిందితుడి నేపథ్యం
అరెస్ట్ అయిన వ్యక్తిని ఉరవకొండ నియోజకవర్గం (Uravakonda Constituency), కూడేరు మండలం (Kuderu Mandal), కలగల్లు గ్రామానికి చెందిన హనుమంతు అలియాస్ చిన్న ఆంజనేయులుగా (Hanumanthu alias Chinna Anjaneyulu) పోలీసులు గుర్తించారు. ఈయన స్థానికంగా టీడీపీ(TDP) నేతగా కొనసాగుతున్నారు. 2021లో జరిగిన ఈ ఘటనలో హనుమంతు తన తెలివితేటలను అక్రమ మార్గంలో ఉపయోగించాడు. ముదిగుబ్బ తహశీల్దార్ అన్వర్ హుస్సేన్ (Anwar Hussain)కు ఫోన్ చేసి తాను ఏసీబీ ఉన్నతాధికారిని అని తహశీల్దార్‌కు ఫోన్ చేసి పరిచయం చేసుకున్నాడు. మీపై ఏసీబీ విచారణ జరుగుతోందని, అది ఆగిపోవాలంటే భారీగా నగదు ముట్టజెప్పాలని డిమాండ్ చేశాడు. ఏసీబీ దాడులకు భయపడిన తహశీల్దార్, నిందితుడు అడిగిన విధంగా రూ. 50 లక్షలు చెల్లించారు.
2021లో జరిగిన ఈ పాత కేసుపై లోతుగా విచారణ జరిపిన పోలీసులు, ఎట్టకేలకు సాంకేతిక ఆధారాలతో నిందితుడు హనుమంతును పట్టుకున్నారు. అధికార పార్టీ పేరు చెప్పుకుంటూ ఇలాంటి మోసాలకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏసీబీ అధికారుల తీరును, వారి ఫోన్ కాల్స్ శైలిని అనుకరిస్తూ తహశీల్దార్‌ను నమ్మించాడు. అవినీతి ఆరోపణలు వస్తే కెరీర్ దెబ్బతింటుందనే అధికారుల భయాన్నే హనుమంతు పెట్టుబడిగా మార్చుకున్నాడు. టీడీపీ నేతగా చలామణి అవుతూ, తెరవెనుక ఇలాంటి దందాలు నడిపినట్లు విచారణలో తేలింది.
ప్రస్తుతం నిందితుడిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు, ఇతని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? లేదా గతంలో మరికొంత మంది అధికారులను ఇలాగే బెదిరించాడా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Feed (@Telugufeedsite) April 5, 2026
నకిలీ ఏసీబీ అధికారి అవతారంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న @JaiTDP నేత అరెస్ట్
టీడీపీ నేత హనుమంతు అలియాస్ చిన్న ఆంజనేయులు ను అరెస్ట్ చేసిన పోలీసులు
ముదిగుబ్బ తహశీల్దార్ అన్వర్ హుస్సేన్ నుంచి 50 లక్షల రూపాయలు వసూలు చేసిన టీడీపీ నేత హనుమంతు
ఉరవకొండ… pic.twitter.com/4PHzvy3j5T








