అతి కిరాత‌కంగా మాజీ డీజీపీ హత్య.. ద‌ర్యాప్తులో షాకింగ్ ట్విస్టులు

అతి కిరాత‌కంగా డీజీపీ హత్య.. ద‌ర్యాప్తులో షాకింగ్ ట్విస్టులు

మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ (Om Prakash) హత్య కేసు (Murder Case) దర్యాప్తులో (Investigation) బ‌య‌ట‌ప‌డుతున్న విష‌యాలు షాకింగ్‌కు (Shocking) గురిచేస్తున్నాయి. కర్ణాటక మాజీ డీజీపీ భార్య పల్లవి (Pallavi) తన భర్తపై ఓ బాటిల్‌తో దాడి చేసి, అనంతరం కారం పొడి చల్లి, తాడుతో కట్టేసి అతి కిరాత‌కంగా హత్య చేసినట్టు తెలుస్తోంది. ఈ విచార‌ణ‌లో తేలిన భయానకమైన విషయం ఏమిటంటే.. భర్త ప్రాణాలు కోల్పోతున్న సమయంలో పల్లవి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చి, ఆయన ముఖంపై గుడ్డ కప్పి తాపీగా కుర్చీలో కూర్చున్నట్టు తెలుస్తోంది.

ఫిర్యాదు చేసిన కుమారుడు కార్తీక్
త‌న తండ్రి హ‌త్య‌పై త‌న‌యుడు కార్తీక్ (Karthik) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా పోలీసులు పల్లవి, కూతురు క్రుతి (Kruti)పై కేసు (Case) నమోదు చేశారు. గత 12 ఏళ్లుగా పల్లవి స్కిజోఫ్రెనియా అనే మానసిక వ్యాధితో బాధపడుతోందని, ఆమెకు బెంగళూరులోని ఒక ప్రముఖ మనోవైద్యుడి వద్ద చికిత్స అందుతుండేద‌ని తెలుస్తోంది. తన భర్త ఓం ప్రకాశ్ తన ప్రాణాలకు ముప్పుగా మారాడని ఆరోపిస్తూ ఐపీఎస్ అధికారుల కుటుంబ సభ్యుల వాట్సాప్ గ్రూపులో సందేశాలు పంపేదట. తుపాకీతో బెదిరించాడంటూ పలు ఆరోపణలు చేసినట్టు సమాచారం. కానీ తన భార్య మానసిక స్థితిని బట్టి ఓం ప్రకాశ్ పెద్దగా పట్టించుకోకుండా ఉంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఆస్తి వివాదాలే హత్యకు దారి?
ఇటీవలి కాలంలో దంపతుల మధ్య ఆస్తి సంబంధిత తగాదాలు తీవ్రరూపం దాల్చినట్టు సమాచారం. దీనివల్లే హత్య జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పల్లవి, క్రుతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కానీ పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే అధికారికంగా అరెస్టులు చేస్తామని బెంగళూరు కమిషనర్ బీ. దయానంద్ (B. Dayanand) తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం పల్లవి ఫోన్ కాల్‌కు స్పందించిన పోలీసులు ఇంటికి వెళ్లి ఓం ప్రకాశ్‌ మృతదేహాన్ని రక్తపు మడుగులో పడి ఉన్నట్టుగా గుర్తించారు. ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు.

“ఐ హ్యావ్ ఫినిష్డ్ మాన్‌స్ట‌ర్”
ఘటన అనంతరం పల్లవి మరో మాజీ డీజీపీకి “I have finished the monster” అని మెసేజ్ పంపినట్టు తెలుస్తోంది. ఓం ప్రకాశ్ ఛాతీ, మెడ, కడుపు, చేతుల్లో పదునైన ఆయుధంతో దాడికి గురై, అధిక రక్తస్రావంతో మృతి చెందినట్టు నిర్ధారించారు. సంఘటన సమయంలో కూతురు క్రుతి కూడా ఇంట్లోనే ఉండటం వల్ల, ఆమె పాత్రపై కూడా విచారణ జరుగుతోంది. ఈ హత్య ఘటనపై హోం మంత్రి పరమేశ్వర (Home Minister Parameshwara) స్పందిస్తూ, ఇది ఎంతో దురదృష్టకరమైందని వ్యాఖ్యానించారు. ఓం ప్రకాశ్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తామని తెలిపారు.

ఓం ప్రకాశ్ జీవితం..
1981 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఓం ప్రకాశ్ స్వస్థలం బిహార్‌లోని చంపారన్ (Champaran, Bihar). ఆయన 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు స్వీకరించి, 2017లో ఉద్యోగ విరమణ చేశారు. ఉద్యోగ‌ విరమణ అనంతరం కుటుంబంతో కలిసి బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్లో (HSR Layout, Bengaluru) నివసిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment