తన లవ్ బ్రేకప్ గురించి తమిళ నటి ఎరికా ఫెర్నాండెజ్ సంచలన విషయాలను బయటపెట్టింది. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను లవ్‌లో ఉన్నప్పుడు పడిన ఇబ్బందుల గురించి కీలక విషయాలను వెల్లడించింది. “నేను ఒక హింసాత్మక సంబంధాన్ని అనుభవించాను. శారీరకంగా చాలా వేధింపులు ఎదుర్కొన్నాను. కానీ అప్పుడు అందరి ముందు మాట్లాడాలని అనుకోలేదు. ఎందుకంటే, ఒక నటిగా ఉన్నప్పుడు ప్రతిదీ వార్తగా మారుతుంది. అందుకే నేను ఈ విషయంలో మౌనంగా ఉండిపోయాను” అని చెప్పింది.
“నేను చాలా కాలం ఒంటరిగా ఉన్నాను.. ఆ సమయంలో ముందుకు వెళ్లలేకపోయాను. నా జీవితంలో వచ్చిన కష్టాలు, హెచ్చు తగ్గులు, గాయం, నమ్మక సమస్యలు ఇలాంటివి ఎన్నో చూశాను. అవన్నీ అనుభవాలుగా నన్ను ఇలా తీర్చిదిద్దాయి” అని వ్యాఖ్యానించారు. ఎరికా కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. సెలెబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటానికి చాలా మంది భయపడతారు. కానీ ఎరికా ఈ విషయాన్ని ధైర్యంగా వెల్లడించడం ఆమెకి ఎదురైన బాధను అర్థం చేసుకునేలా చేస్తోంది.