ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ ఖాతాదారులకు అదనపు ప్రయోజనాలను అందించే ఒక కీలక స్కీమ్‌ను అందిస్తోంది. ఈ స్కీమ్ ద్వారా పీఎఫ్ ఖాతాదారులు కొన్ని నిబంధనలను పాటిస్తే రూ. 50,000 వరకు అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. మరి ఈ లాభాలను పొందడానికి అర్హత ఏమిటి?
లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్ స్కీమ్.. అర్హతలు
EPFO లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్ స్కీమ్ కింద ఈ ప్రయోజనాలను పొందేందుకు ఖాతాదారులు కొన్ని ప్రత్యేక నిబంధనలను పాటించాలి. ఖాతాదారులు ఒకే పీఎఫ్ అకౌంట్‌కు 20 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా కంటిన్యూ చేయాలి. వారు ఈ స్కీమ్ కింద ప్రయోజనాలు పొందగలరు. ఉద్యోగం మారినా, పాత పీఎఫ్ అకౌంట్‌ను కంటిన్యూ చేసిన ఎంప్లాయీస్ ఈ పథకానికి అర్హులు అవుతారు.
జీతం ఆధారంగా లాభాలు..
రూ.5,000 వరకు జీతం పొందే వారికి రూ.30,000 వరకు ప్రయోజనాలు అందుకుంటారు. రూ.5,001 నుండి 10,000 జీతం పొందేవారికి రూ.40,000 వరకు ప్రయోజనాలు. రూ.10,000 కంటే ఎక్కువ మూలవేతనం ఉన్న వారికి రూ.50,000 వరకు ప్రయోజనాలు అందుతాయి. ఉద్యోగ మార్పు తర్వాత, మీ ప్రస్తుత కంపెనీ ద్వారా పాత పీఎఫ్ అకౌంట్ సమాచారాన్ని అప్డేట్ చేయాలి. ఈ విధంగా, మీరు అర్హతలను పాటించి, రూ. 50,000 అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.








