టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌.. అతడి స్థానంలో బుమ్రా

టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌.. అతడి స్థానంలో బుమ్రా

టీమిండియా (Team India)-ఇంగ్లండ్ (England) మధ్య ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో (Lords Ground) మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ స్వభావాన్ని బట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టోక్స్ వెల్లడించాడు.

మరోవైపు, టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) మాట్లాడుతూ.. తాను టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకునేవాడినని, తమ బౌలర్లు పూర్తి విశ్వాసంతో ఉన్నారని తెలిపాడు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయడం తనకు సంతోషంగా ఉందన్న గిల్, జట్టులో ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించాడు. యువ పేసర్ ప్రసిద్ కృష్ణ (Prasidh Krishna) స్థానంలో పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను ఆడిస్తున్నట్లు వెల్లడించాడు.

టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో గెలవగా, ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ 336 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌కు ఇది తొలి విజయం.

లార్డ్స్‌లో ఇరుజట్ల మధ్య ఇప్పటివరకు 19 టెస్టులు జరిగాయి. ఇందులో ఇంగ్లండ్ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, భారత్ మూడు టెస్టులు గెలిచింది, నాలుగు డ్రా అయ్యాయి. 2021లో చివరిసారిగా ఇక్కడ టీమిండియా గెలిచింది.

తుది జట్లు:

భారత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాష్‌దీప్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి.

ఇంగ్లండ్: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్.

Join WhatsApp

Join Now

Leave a Comment