బషీర్ గాయం, శస్త్రచికిత్స
లార్డ్స్ టెస్టు (Lords Test)లో మూడో రోజు రవీంద్ర జడేజా క్యాచ్ అందుకోబోయి బషీర్ (Bashir) గాయపడ్డాడు (Injured). ఆ గాయం తర్వాత అతను ఆ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేకపోయాడు. అయినప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో గాయంతోనే బ్యాటింగ్‌కు దిగి 9 బంతుల్లో 2 పరుగులు చేశాడు. ఐదో రోజు ఎక్కువగా డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమైనా, టీమిండియా టెయిలెండర్లు పోరాడుతున్న దశలో కెప్టెన్ బెన్ స్టోక్స్ అతన్ని తిరిగి బరిలోకి దించాడు. బషీర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మహ్మద్ సిరాజ్‌ను క్లీన్ బౌల్డ్ చేసి ఇంగ్లండ్ (England) గెలుపును ఖరారు చేశాడు. ఈ సిరీస్‌లో బషీర్ 3 మ్యాచ్‌ల్లో 54.1 సగటున 10 వికెట్లు తీశాడు. ఈ వారం చివర్లో అతని వేలికి శస్త్రచికిత్స జరగనుందని ECB తెలిపింది.
ప్రత్యామ్నాయాల వేటలో ఇంగ్లండ్
బషీర్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇంకా ప్రకటించలేదు. జాక్ లీచ్, రెహాన్ అహ్మద్, లియామ్ డాసన్, టామ్ హార్ట్లీ ఈ స్థానం కోసం పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగో టెస్టు జూలై 23 నుంచి మాంచెస్టర్‌లో ప్రారంభం కానుంది.
టీమిండియాకు నిరాశ
తాజాగా ముగిసిన లార్డ్స్ టెస్టు టీమిండియాకు గుండెకోతను మిగిల్చింది. విజయానికి అత్యంత చేరువగా వచ్చినా భారత్ ఓటమి పాలైంది. ఐదో రోజు చేతిలో 6 వికెట్లతో 135 పరుగులు చేయాల్సిన టీమిండియా లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమైంది. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ విఫలం కాగా, 82/7 నుంచి జట్టును గెలిపించేందుకు రవీంద్ర జడేజా (181 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) వీరోచితంగా పోరాడాడు. అయినప్పటికీ 193 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 74.5 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. అనూహ్య మలుపులు, ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం భారత్‌ను దెబ్బ తీసింది.