గుండెపోటుతో మ‌రో బీటెక్ విద్యార్థి మృతి

గుండెపోటుతో బీటెక్ విద్యార్థి మృతి

ఇటీవ‌ల కార్డియాక్ అరెస్ట్‌తో యువ‌త‌ మ‌ర‌ణాలు ఎక్కువైపోయాయి. వ‌రుస మ‌ర‌ణాలు యుక్త వ‌య‌సు వారిని భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. తాజాగా మేడ్చల్ (Medchal) జిల్లా గుండ్లపోచంపల్లి (Gundlapochampally) మండలంలోని కండ్లకోయ (Kandlakoya) లో ఉన్న సీఎంఆర్ సెట్ ఇంజనీరింగ్ కళాశాలలో (CMR SET Engineering College) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మూడో సంవత్సరం సైబర్ సెక్యూరిటీ కోర్సు (Cyber Security Course) చదువుతున్న మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన సుమంత్ (Sumanth) గుండెపోటు (Heart Attack)తో ప్రాణాలు కోల్పోయాడు (Died).

మంగళవారం కాలేజీకి వచ్చిన సమయంలో సుమంత్‌కు ఆకస్మికంగా ఛాతిలో నొప్పి మొదలైంది. వెంటనే స్పందించిన కళాశాల సిబ్బంది మరియు స్నేహితులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న సమయంలోనే ఆయన తుది శ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనతో విద్యార్థుల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. యుక్త వయసులో గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు పెరుగుతుండటం కలవరపెడుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment