సీఎం చంద్రబాబు కుమారుడు, ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ బర్త్ డే వేడుకలు ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు అత్యుత్సాహం ప్రదర్శించారు. విద్యా శాఖ మంత్రి లోకేశ్ బర్త్ డే సందర్భంగా ఆయన దృష్టిలో పడేందుకు విద్యార్థులతో మండుటెండలో విచిత్ర విన్యాసాలు చేయించారు.
‘పిల్లలు ఎండలో ఉన్నా పర్లేదు.. మనం ఎండలో ఉన్నాంగా.. అంటూ ఓ ఉపాధ్యాయుడు మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది.’
మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్‌డే లోకేష్ పేరుతో విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టారు ఉపాధ్యాయులు. డ్రోన్ ఎగరేసి ఆ దృశ్యాన్ని సుందరంగా చిత్రీకరించేంత వరకు గంటల తరబడి విద్యార్థులను ఎండలో మగ్గారు. విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టి నారా లోకేష్‌కు బర్త్‌డే విషెస్ చెప్పించడంపై ఆగ్రహం వ్యక్తం విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు సైతం ఉపాధ్యాయుల తీరుపై విస్మయం వ్యక్తం చేశారు. విద్యా శాఖ మంత్రి బర్త్ డే అయితే విద్యార్థులను ఇలా ఎండలో కూర్చోబెట్టి వేధిస్తారా..? అని ప్రశ్నిస్తున్నారు.