ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా మండవల్లి మండలం బైరవపట్నంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం వేటగాళ్ల జీవితాలను కల్లోలానికి గురి చేసింది. పక్షులను వేటాడేందుకు ఉపయోగించే నాటు తుపాకీ గుండు సామగ్రికి దోమల అగరబత్తీ అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 ఇళ్లు దగ్ధమయ్యాయి.
ఇళ్లలో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు మరింత వేగంగా వ్యాపించాయి. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు, ఒక మహిళకు తీవ్ర గాయాలు కావడంతో వారికి కైకలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. బాధితుల పునరావాసానికి అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.