ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన ఎలాన్ మస్క్(Elon Musk) మళ్లీ తండ్రి అయ్యారు. ఈ విషయాన్ని మస్క్ ప్రియురాలు షివాన్ జెలీస్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వీరి పుట్టిన బిడ్డకి “సెల్డాన్ లైకార్గస్”* (Seldon Lycargus) అనే విభిన్నమైన పేరు పెట్టారు. జెలీస్ చేసిన ఈ అనౌన్స్‌మెంట్‌కు ఎలాన్ మస్క్ హార్ట్ ఎమోజీతో స్పందించారు. దీంతో ఈ వార్త క్షణాల్లో వైరల్ అయింది. ఇక, మస్క్ సంతానం సంఖ్య ఇప్పటివరకు 14కు చేరిన సంగతి తెలిసిందే.
ఎలాన్ మస్క్ పిల్లల ప్రత్యేక పేర్లు ..
మస్క్ సంతానానికి ఎప్పుడూ అద్భుతమైన, విభిన్నమైన పేర్లు పెట్టడం కొత్తేమీ కాదు. గతంలో X Æ A-12, Exa Dark Sideræl Musk వంటి పేర్లతో మస్క్ పిల్లలు వార్తల్లో నిలిచారు. ఇప్పుడు “సెల్డాన్ లైకార్గస్”* కూడా అదే కోవలో చేరింది.