అమెరికన్ ఫైనాన్షియర్ (American Financier), లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ (Jeffrey Epstein) కేసు (Case) ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా వెలువడిన ఈ కేసు పత్రాల్లో ప్రపంచ కుబేరుడు, టెస్లా (Tesla), ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ (Elon Mask) పేరు బయటపడింది. ఎప్స్టీన్, మస్క్ మధ్య ఉన్న సంబంధాలను ఈ ఫైళ్లు బహిర్గతం చేశాయి, ఇది అమెరికా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది.
అంతర్జాతీయ నివేదికల ప్రకారం, డిసెంబర్ 2014 నాటి పత్రాల్లో ఎప్స్టీన్ ఒక ప్రైవేట్ ద్వీపానికి మస్క్‌ను ఆహ్వానించినట్లు ఉంది. ఈ ఫైళ్లలో చేతితో రాసిన ఒక నోట్ కూడా లభించింది, ఇది మరిన్ని సంచలనాలు వెలువడనున్నాయనే సూచన ఇస్తోంది. సాధారణంగా, ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు సెలబ్రిటీలు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కానీ మస్క్ అందుకు భిన్నంగా, ఈ ఆరోపణలపై సోషల్ మీడియాలో బహిరంగంగా స్పందించారు.
మస్క్ స్పందన:
ఎప్స్టీన్ ఫైల్స్‌లో తన పేరు ఉందనే వార్త వైరల్ అవ్వగానే, ఎలోన్ మస్క్ వెంటనే స్పందించారు. “ఇది అబద్ధం” అంటూ ఒక్క ముక్కలో తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఈ లైంగిక అక్రమ రవాణా ముఠా కేసులో ఎలోన్ మస్క్ మాత్రమే కాకుండా, మరికొందరు ప్రముఖుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. టెక్ దిగ్గజం, పేపాల్, పలాంటిర్ వంటి సంస్థల సహ వ్యవస్థాపకుడు పీటర్ థీల్, అలాగే మాజీ వైట్ హౌస్ చీఫ్ స్ట్రాటజిస్ట్ స్టీవ్ బానన్ పేర్లు కూడా ఈ ఫైళ్లలో ఉన్నాయి.








